ఐదు వేల జీతమిస్తే బతకడం ఎలా..?
దిశ, నాగార్జునసాగర్ : నాగార్జున సాగర్‌లో కమలనెహ్రూ హాస్పిటల్ కాంట్రాక్టు కింద పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రూ. 5 వేలు జీతం ఇస్తే బతకడం ఎలా అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించడం లేదన్నారు. ఈ క్రమంలోనే బుధవారం శ్రీ సాయి సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ క్రాంటాక్టు కింద […]
దిశ, నాగార్జునసాగర్ : నాగార్జున సాగర్‌లో కమలనెహ్రూ హాస్పిటల్ కాంట్రాక్టు కింద పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రూ. 5 వేలు జీతం ఇస్తే బతకడం ఎలా అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించడం లేదన్నారు.
ఈ క్రమంలోనే బుధవారం శ్రీ సాయి సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ క్రాంటాక్టు కింద పనిచేస్తున్న సుమారు 40 మంది శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, కార్మికులు అందరూ సమస్యలు పరిష్కరించాలని విధులను బహిష్కరించి ఆస్పత్రి ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. జీవో ప్రకారం కార్మికులకు కనీస వేతనం రూ.18000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కరోనా సమయంలో కూడా ప్రాణానికి లెక్క చేయకుండా విధులు నిర్వహించి అధికారులకు ఏమాత్రం చలనం లేదన్నారు. నిత్యావసర ధరలకు తోడు గ్యాస్ ధర పెరగడం కార్మికులకు భారంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే 68 జీవోను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు శంకర్ నాయక్, కుమారి, సతీష్ గౌడ్, మంగితి శ్రీను, కిరణ్ పాల్గొన్నారు.