బిగ్‌బాస్‌లో సోషల్ మీడియా స్టార్స్

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ ‘సీజన్ 4’ మొదలైంది. ఈ రియాలిటీ షోకు వరుసగా రెండోసారి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లలో కాస్త ఫేమస్ పర్సనాలిటీలు, తెలిసిన ముఖాలే ఎక్కువగా ఉండగా, ఈ సారి మాత్రం బిగ్‌బాస్ హౌస్.. అన్‌నోన్ ఫేసెస్‌తో పాటు అన్ ఫెమిలియర్ పర్సన్స్‌తో నిండిపోయింది. టీవీ, సినిమాలు మాత్రమే చూసే అలవాటున్న వాళ్లకు.. ఈ సీజన్‌లో పార్టిసిపేట్ చేస్తున్న బిగ్‌బాస్ కంటెస్టంట్ల ముఖాలు తెలిసే చాన్స్ తక్కువే. ఈ […]

Update: 2020-09-07 04:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ ‘సీజన్ 4’ మొదలైంది. ఈ రియాలిటీ షోకు వరుసగా రెండోసారి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లలో కాస్త ఫేమస్ పర్సనాలిటీలు, తెలిసిన ముఖాలే ఎక్కువగా ఉండగా, ఈ సారి మాత్రం బిగ్‌బాస్ హౌస్.. అన్‌నోన్ ఫేసెస్‌తో పాటు అన్ ఫెమిలియర్ పర్సన్స్‌తో నిండిపోయింది. టీవీ, సినిమాలు మాత్రమే చూసే అలవాటున్న వాళ్లకు.. ఈ సీజన్‌లో పార్టిసిపేట్ చేస్తున్న బిగ్‌బాస్ కంటెస్టంట్ల ముఖాలు తెలిసే చాన్స్ తక్కువే. ఈ సారి సోషల్ మీడియా స్టార్లకే బిగ్ బాస్ రెడ్ కార్పెట్ పరిచినట్టు స్పష్టం కాగా.. ఆ వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

యూత్‌తో నిండిపోయిన యూట్యూబ్ వీడియోల్లో.. ఐదు పదుల వయసులో, తెలంగాణ పడికట్టు పదాలతో యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను దోచుకున్న యూట్యూబ్ స్టార్ ‘గంగవ్వ’.. బిగ్‌బాస్ హౌస్‌లోకి స్పెషల్ హౌస్‌మేట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె టీవీ ప్రేక్షకులకే కాదు.. అందరికీ తెలిసిన ముఖమే. టీవీ యాంకర్ లాస్యతో పాటు కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్నవారికి కరాటే కల్యాణి సుపరిచితురాలే. ఇక కొరియోగ్రాఫర్, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అమ్మ రాజశేఖర్.. ఆట డ్యాన్స్ ప్రోగ్రామ్ జడ్జిగానూ వ్యవహరించి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘సత్యం, ధన 51 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్య కిరణ్.. హీరోయిన్ కల్యాణిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయారు. ప్రస్తుతం దర్శకుడిగా పెద్దగా అవకాశలేం లేవు. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అభిజిత్.. ‘మిర్చిలాంటి కుర్రాడు’ సినిమాతోనూ అలరించాడు. ఆ తరువాత యూఎస్ వెళ్లిన ఈ యువ నటుడు.. మళ్లీ బిగ్ బాస్ స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చాడు.

‘సుడిగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించిన హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్‌. తెలుగులోనే కాకుండా తమిళ‌, మళయాళం, గుజరాతీ భాషల్లోనూ హీరోయిన్‌గా నటించింది. సీజన్‌ 4లో ఉన్న వ‌న్‌ అండ్ ఓన్లీ హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ కావడం విశేషం. ఇక ర్యాపర్‌, సింగర్‌ కమ్ నటుడిగా నోయల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. గతేడాది హీరోయిన్ ఎస్తర్‌‌ను వివాహం చేసుకున్న నోయల్.. లేటెస్ట్‌గా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించాడు. ఇక న్యూస్ విభాగానికి వస్తే.. టీవీ9 న్యూస్ ప్రజెంటర్ దేవీ నాగవల్లి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలే. ఇటు యాంకరింగ్‌, అటు రిపోర్టింగ్‌లోనూ తనదైన ముద్ర వేసింది. రాజమండ్రికి చెందిన తను.. జర్నలిజంపై మక్కువతో మాస్ కమ్యునికేషన్‌లో డిప్లొమో చేసి టీవీ9లో కెరియర్ మొదలుపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లో టీవీ9 కంటెస్టంట్ ఒకరు ఉండాలన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ సారి దేవీకి చాన్స్ ఇచ్చారు.

అఖిల్ సార్థక్ :
2018-19 మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా నిలిచిన అఖిల్ సార్థక్.. మంచి ఫిట్‌నెస్ ఫ్రీకర్. ‘బావ మరదలు’ అనే సినిమాలో విలన్‌గా చేసిన అఖిల్.. ఆ తర్వాత సీరియళ్లలో అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ముత్యాల ముగ్గు సీరియల్‌తో తొలిసారి బుల్లితెరపై విలన్‌గా కనిపించాడు. ‘ఎవ్వరే నువ్వు మోహిని’ అనే సీరియల్‌లో నెగెటివ్ రోల్‌లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. బంగారు గాజులు, కల్యాణి సీరియల్‌లోనూ నటిస్తున్నాడు. అఖిల్ ఇన్‌స్టాలో 12వేలకు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం.

దేత్తడి హారిక :
పక్కా తెలంగాణ యాసతో.. అనతి కాలంలోనే టాప్ యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. తమాడా మీడియా ఆధ్వర్యంలో.. ‘దేత్తడి’ అనే యూట్యూబ్ చానెల్‌తో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఈ ఒక్క ప్రొగ్రామే అలేఖ్య హారికను కాస్త.. దేత్తడి హారికగా మార్చేసింది. హారిక ఇన్‌స్టాలో 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

జోర్దార్ సుజాత :
తెలుగు న్యూస్ చానెళ్లలో టాప్ ట్రెండింగ్‌లో ఉండే కార్యక్రమాలన్నీ కూడా ‘తెలంగాణ యాసలో వచ్చే ప్రోగ్రామ్’లే. అలా హెచ్ఎమ్ టీవీలో ‘జోర్దార్’ వార్తలు చదివే సుజాత.. జోర్దార్ సుజాతగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఆమె అసలు పేరు శ్రుతి. గత సీజన్‌లో శివజ్యోతి తెలంగాణ యాసతో మెరిపిస్తే.. ఈసారి ఆ స్థానాన్ని సుజాత్ భర్తీ చేసింది.

మెహబూబ్ దిల్‌సే :
సూపర్ హిట్ పాటలకు తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి వీడియో తీసే యూట్యూబర్, డ్యాన్సర్, యాక్టర్.. మెహబూబ్. టిక్‌టాక్ స్టార్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్‌‌లోనూ నటిస్తుంటాడు. ఇతని యూట్యూబ్ చానెల్‌కు 4 లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. మెహబూబ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాడు.

సయ్యద్ సోహైల్ :
బిగ్‌బాస్ హౌస్‌‌లోకి అడుగుపెట్టిన సోహైల్.. కొత్త బంగారులోకం సినిమాలో చిన్న పాత్ర చేశాడు. ఆ తర్వాత.. పలు సీరియల్స్, సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే ‘యూరేక’ అనే సినిమాలో లీడ్ రోల్‌లో నటించాడు. ఆ సినిమా తనకు నష్టాన్ని మిగిల్చింది.

అరియానా గ్లోరీ :
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఓ యాంకర్‌ అంటే తనకు ఇష్టమని ప్రకటించిన విషయం తెలిసిందే. అదిగో ఆమె.. అరియానా గ్లోరీ. ఆనాటి నుంచి ఈమెకు బాగానే పేరొచ్చింది. 2015లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అరియానా స్వస్థలం హైదారాబాదే. జెమినీ కామెడీ చానెల్‌ ఆమెకు గుర్తింపు తీసుకురాగా, టిక్ టాక్ స్టార్‌గానూ అరియానా నెటిజన్లను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో సినిమా సెల‌ెబ్రిటీల‌ను, టిక్‌టాక్ స్టార్ల‌ను కూడా ఇంట‌ర్వ్యూ చేస్తోంది. ఆమె ఇన్‌స్టా అకౌంట్‌కు 63వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

 

Tags:    

Similar News