ఆ అధికారులపై కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు కొట్టివేత
దిశ, తెలంగాణ బ్యూరో: కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని విధించిన శిక్ష నుంచి ఆ అధికారులకు ఊరట లభించింది. ఓ కేసులో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు విధించిన శిక్ష కేసుకు సంబంధించి అప్పీల్‌కు అనుమతి ఇస్తూ కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను హై కోర్టు కొట్టేసింది. సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులపై అధికారులు అప్పీల్ చేసుకునేందుకు చీఫ్ జస్టిస్‌తో కూడిన చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం […]
దిశ, తెలంగాణ బ్యూరో: కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని విధించిన శిక్ష నుంచి ఆ అధికారులకు ఊరట లభించింది. ఓ కేసులో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు విధించిన శిక్ష కేసుకు సంబంధించి అప్పీల్‌కు అనుమతి ఇస్తూ కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను హై కోర్టు కొట్టేసింది. సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులపై అధికారులు అప్పీల్ చేసుకునేందుకు చీఫ్ జస్టిస్‌తో కూడిన చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది.
2009 కి సంబంధించిన కేసులో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సర్వే నం.222/1 నుంచి 222/20 వరకు గల 383 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మినహాయించాలనే కేసులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఈ నెల మొదటి వారంలో సింగిల్ బెంచ్ జడ్డి ఆరు నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధించింది. అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్, పీసీసీఎఫ్ ఆర్. శోభ, రంగారెడ్డి సీసీఎఫ్ సునీతా భగవత్ తదితరులు గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు దిక్కరణకు పాల్పడ్డారనేది అభియోగం.
అయితే ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కోర్టుకు హాజరవటంతో పాటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే అప్పీలుదారు కోర్టు ధిక్కరణ కోసం పిటిషన్ వేసే గడువు కూడా ముగిసిపోయింది. దాంతో ఇది కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని, తమను శిక్షనుంచి మినహాయించి అప్పీలుకు అవకాశం ఇవ్వాలనే ఉన్నతాధికారుల పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది.