భారీగా క్షీణించిన కాంట్రాక్టు ఒప్పందాలు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా దేశంలో చాలా కాంట్రాక్టులు రద్దయ్యాయి. లాక్‌డోఉన్ ఒకవైపు, ప్రభుత్వాలకు ఇతర ఒత్తిడులు అధికమవడంతో పలు రంగాల్లోని కాంట్రాక్టులన్ని వాయిదా పడ్డాయి. ఇది ఎంత కాలానికి కోలుకుంటుందో చెప్పలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల రంగం క్రితం ఏడాది నుంచే నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది కొవిడ్-19 వల్ల ఈ రంగం తీవ్రమైన అగాథంలోకి పడిపోయే ప్రమాదముందని ఓ నివేదిక పేర్కొంది. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నిర్మాణ రంగం […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా దేశంలో చాలా కాంట్రాక్టులు రద్దయ్యాయి. లాక్‌డోఉన్ ఒకవైపు, ప్రభుత్వాలకు ఇతర ఒత్తిడులు అధికమవడంతో పలు రంగాల్లోని కాంట్రాక్టులన్ని వాయిదా పడ్డాయి. ఇది ఎంత కాలానికి కోలుకుంటుందో చెప్పలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల రంగం క్రితం ఏడాది నుంచే నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది కొవిడ్-19 వల్ల ఈ రంగం తీవ్రమైన అగాథంలోకి పడిపోయే ప్రమాదముందని ఓ నివేదిక పేర్కొంది. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నిర్మాణ రంగం 43 శాతం దిగజారినట్లు ఎంకే గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది.
మార్చి మూడో వారం నుంచి లాక్‌డౌన్ విధించడంతో మౌలిక వసతుల రంగం తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. విద్యుత్ సరఫరా కాంట్రాక్టులు 77 శాతం తగ్గిపోయాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు 34.57 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. మౌలిక వసతుల రంగం అధికంగా 43 శాతం, నీటి సరఫరా రంగం కాంట్రాక్టులు 29 శాతం, నీటి పారుదల ప్రాజెక్ట్లు 65 శాతం తగ్గిపోయాయని నివేదిక పేర్కొంది. మార్చి నెలలో ఒక్కటే 82 శాతం నీటి పారుదల, 41 శాతం రియల్ ఎస్టేట్, 82 శాతం రహదారులు, 57 శాతం రైల్వే, 41 శాతం హాస్పిటల్ కాంట్రాక్టులు తగ్గిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. భవిష్యత్తుల్లో కరోనా వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇతర ఒత్తిడులు అధికమవనున్నాయి. ఈ పరిణామాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంట్రాక్టు ఒప్పందాలు పూర్తీగా క్షీణిస్తాయని నివేదిక హెచ్చరించింది.
Tags: COVID-19, infrastructure sector, construction contracts