ప్లాస్మా దానం చేసిన కానిస్టేబుల్

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ కరోనా నుంచి కోలుకుని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ సన్ షైన్ ఆసుపత్రిలో O+ప్లాస్మా అవసరం ఉందని వాట్సాప్ గ్రూపులో ఆయనకు సమాచారం వచ్చింది. వెంటనే దానికి స్పందించి, డ్యూటీ నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరాడు. కరోనా సోకిన వేరొక వ్యక్తిని రక్షించడానికి, ప్లాస్మాదానం చేశాడు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్లు, […]

Update: 2020-08-17 06:11 GMT

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ కరోనా నుంచి కోలుకుని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ సన్ షైన్ ఆసుపత్రిలో O+ప్లాస్మా అవసరం ఉందని వాట్సాప్ గ్రూపులో ఆయనకు సమాచారం వచ్చింది.

వెంటనే దానికి స్పందించి, డ్యూటీ నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరాడు. కరోనా సోకిన వేరొక వ్యక్తిని రక్షించడానికి, ప్లాస్మాదానం చేశాడు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్లు, కరోనా వ్యాధి సోకిన వ్యక్తి బంధువులు, జిల్లా పోలీసు అధికారులు చంద్రశేఖర్‌ను అభినందించారు.

Tags:    

Similar News