ఢిల్లీ హింస: కాంగ్రెస్ లేవనెత్తిన ఆరు ప్రశ్నలు

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆరు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుంచి సమాధానమివ్వాలని డిమాండ్ చేసింది. ఈ రోజు (బుధవారం) నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేవనెత్తిన ఆ ఆరు ప్రశ్నలు ఇవి.. 1) గత ఆదివారం నుంచి కేంద్ర హోం మంత్రి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? 2) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతి నుంచి ఇవ్వాళ్టి వరకు ఇంటెలిజెన్స్ ఏ […]

Update: 2020-02-26 03:29 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆరు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుంచి సమాధానమివ్వాలని డిమాండ్ చేసింది. ఈ రోజు (బుధవారం) నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేవనెత్తిన ఆ ఆరు ప్రశ్నలు ఇవి..

1) గత ఆదివారం నుంచి కేంద్ర హోం మంత్రి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

2) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతి నుంచి ఇవ్వాళ్టి వరకు ఇంటెలిజెన్స్ ఏ రిపోర్టులనిచ్చింది?

3) కేంద్ర హోం శాఖ చెబుతున్నట్టు హింస ఆకస్మికంగా చోటుచేసుకుందా? లేక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పేర్కొన్నట్టు ప్లాన్ ప్రకారం జరిగిందా?

4) ఆదివారం అల్లర్లు జరిగే ప్రమాదమున్నట్టు సంకేతాలుండగా.. మోహరింపజేసిన పోలీసు బలగాలెన్ని?

5) పరిస్థితులు ఢిల్లీ పోలీసుల నియంత్రణ నుంచి అదుపుతప్పిపోయినప్పుడు వెంటనే అదనపు బలగాలను ఎందుకు పిలవలేదు?

6) గత ఆదివారం నుంచి ఢిల్లీ సీఎం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు?

Tags:    

Similar News