విజయ ఢంకా మోగించిన కాంగ్రెస్.. ఆ మూడు ఎమ్మెల్యే సీట్లు వారివే !

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా అక్టోబర్ -30వ తేదీన జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఉపఎన్నికలకు సంబంధించి నవంబర్ 2వ తేదీ(మంగళవారం) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగియడంతో పాటు గెలుపొందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగా.. ఏపీలో వైసీపీ పార్టీ అభ్యర్థిని ఘన విజయం సాధించారు. ఇకపోతే హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగగా అక్కడ కాంగ్రెస్ […]

Update: 2021-11-02 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా అక్టోబర్ -30వ తేదీన జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఉపఎన్నికలకు సంబంధించి నవంబర్ 2వ తేదీ(మంగళవారం) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగియడంతో పాటు గెలుపొందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగా.. ఏపీలో వైసీపీ పార్టీ అభ్యర్థిని ఘన విజయం సాధించారు. ఇకపోతే హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగగా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది.

మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. లోకసభ స్థానానికి ఇంకా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఫతేపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి -5,789 ఓట్ల ఆధిక్యంతో గెలవగా.. ఆర్కీలో -3,219, జుబ్బల్ కోత్హాయిలో-6,293 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నార్త్‌లో కాంగ్రెస్ పార్టీ విజయాలను నమోదు చేస్తున్నా సౌత్‌లో జరిగిన ఏపీ, తెలంగాణలో హస్తం పార్టీ డిపాజిట్లను కోల్పోయింది.

Tags:    

Similar News