రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా అన్ని రాజ్‌భవన్‌ల ఎదుట ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. రాజ్‌భవన్ దగ్గర నిరసన తెలిపేందుకు గాంధీభవన్ నుంచి బయలుదేరగా గేటు దాటగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఇప్పుడు రాజస్థాన్‌లో కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. […]

Update: 2020-07-27 08:19 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా అన్ని రాజ్‌భవన్‌ల ఎదుట ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. రాజ్‌భవన్ దగ్గర నిరసన తెలిపేందుకు గాంధీభవన్ నుంచి బయలుదేరగా గేటు దాటగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఇప్పుడు రాజస్థాన్‌లో కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, మాజీ ఎంపీ వీహెచ్, గూడూరు నారాయణ‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రతినిధులు గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి కోరుతూ లేఖ పంపించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: ఎంపీ రేవంత్‌రెడ్డి

బీజేపీ అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలనుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ అధికారులను ఉసిగొల్పి ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 31న అసెంబ్లీని ఏర్పాటు చేయాలని, బీజేపీ విధానాలపై శాసన సభలో చర్చించాలని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News