బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బుధవారం గాంధీభవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించిన హస్తం పార్టీ.. 50శాతం టికెట్లను బీసీలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లాలని అభిప్రాయపడింది. అదేవిధంగా మహిళలు, దళితులపై దాడులకు నిరసనగా నవంబర్ 7న ఇందిరా పార్క్ వద్ద ధర్నా, 11న ఖమ్మంలో ట్రాక్టర్లతో ర్యాలీ, 12నజిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలని తెలిపింది. […]
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బుధవారం గాంధీభవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించిన హస్తం పార్టీ.. 50శాతం టికెట్లను బీసీలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లాలని అభిప్రాయపడింది. అదేవిధంగా మహిళలు, దళితులపై దాడులకు నిరసనగా నవంబర్ 7న ఇందిరా పార్క్ వద్ద ధర్నా, 11న ఖమ్మంలో ట్రాక్టర్లతో ర్యాలీ, 12నజిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలని తెలిపింది. ఇక రైతు సమస్యలపై ఉద్యమానికి శాశ్వత కమిటీ వేయాలని, దీనిపై మరోసారి సమావేశంమై తుది నిర్ణయానికి రావాలని కోర్ కమిటీ భావించింది.