హుజురాబాద్​ బై ఎలక్షన్​పై కాంగ్రెస్​ అభ్యంతరం

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల కమిషన్​ మార్గదర్శకాలను పాటించకుండా హుజురాబాద్​ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్​ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు టీపీసీసీ సీనియర్​ ఉపాధ్యక్షుడు జి నిరంజన్​ మంగళవారం సీఈసీకి లేఖ రాశారు. ఈవీఎం, వీవీప్యాట్ మొదటి స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దకుండా హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 8న వీవీ ప్యాట్లు, ఈవీఎంల తనిఖీల్లో […]

Update: 2021-09-28 09:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల కమిషన్​ మార్గదర్శకాలను పాటించకుండా హుజురాబాద్​ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్​ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు టీపీసీసీ సీనియర్​ ఉపాధ్యక్షుడు జి నిరంజన్​ మంగళవారం సీఈసీకి లేఖ రాశారు. ఈవీఎం, వీవీప్యాట్ మొదటి స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దకుండా హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ నెల 8న వీవీ ప్యాట్లు, ఈవీఎంల తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దాలని, ఆ తరువాతే ఈవీఎం, వీవీప్యాట్ మొదటి స్థాయి తనిఖీలు తిరిగి నిర్వహించాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తూ అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ తన బాధ్యతలను నిర్వహించలేరని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం మరో ఐఏఎస్ అధికారిని ఎన్నికల అధికారిగా నియమించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కోరారు.

Tags:    

Similar News