నల్గొండ ప్రజలు ఉసురు తగులుతోంది

దిశ ప్రతినిధి, నల్లగొండ: సీఎం కేసీఆర్‎కు నల్గొండ ప్రజలు ఉసురు తగులుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మణవెల్లంల, ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై విరుచుకుపడ్డారు. బుధవారం బ్రహ్మణవేల్లి ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టులు అవసరమున్న దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని కోమటిరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కోట్లు ఖర్చు పెట్టి వరద నీటిని లిఫ్ట్ చేసి సముద్రంలోకి వదిలారని ఆరోపించారు. ఎడారిగా ఉన్న నల్లగొండ ప్రాంతాన్ని […]

Update: 2020-09-09 05:52 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: సీఎం కేసీఆర్‎కు నల్గొండ ప్రజలు ఉసురు తగులుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మణవెల్లంల, ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై విరుచుకుపడ్డారు. బుధవారం బ్రహ్మణవేల్లి ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి సందర్శించారు.

ప్రాజెక్టులు అవసరమున్న దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని కోమటిరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కోట్లు ఖర్చు పెట్టి వరద నీటిని లిఫ్ట్ చేసి సముద్రంలోకి వదిలారని ఆరోపించారు. ఎడారిగా ఉన్న నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు బ్రహ్మణవెల్లంల, ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్టులకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 70 శాతం పూర్తైన ఈ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోతే పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News