కేంద్రంపై గులాంనబీ ఆజాద్ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో దుమారం రేగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మంగళవారం కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ అప్రజాస్వామికం అని, నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. వెంటనే ఎంపీలపై వేసిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. తమ మూడు డిమాండ్లను అంగీకరించేంతవరకూ సమావేశాలను బహిష్కరిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు […]

Update: 2020-09-22 01:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో దుమారం రేగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మంగళవారం కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ అప్రజాస్వామికం అని, నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. వెంటనే ఎంపీలపై వేసిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు.

తమ మూడు డిమాండ్లను అంగీకరించేంతవరకూ సమావేశాలను బహిష్కరిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం వ్యవసాయ బిల్లును తీసుకొచ్చిందని ఆజాద్ విమర్శించారు. ఈ బిల్లుతో ఎంపీలెవరూ సంతోషంగా లేరని తెలిపారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం… కనీస మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. ఎఫ్‌సీఐ వంటి ప్రభుత్వ సంస్థలు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పంటలను కొనకుండా బిల్లు ఉండాలని తెలిపారు.

Tags:    

Similar News