రైతుబంధుపై నిబంధనలొద్దు: జీవన్‌రెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో: రైతుబంధుపై నిబంధనలు విధించడం మంచిపద్ధతి కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. మంగళవారం సీఎం కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ రాశారు. ధాన్యం సేకరణలో 5 నుంచి 10కిలోల తరుగు తీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకాలకు క్వింటాలుకు రూ.2,500 మద్ధతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండ్ల తోటల రైతులకు కూడా ప్రోత్సహకాలు […]

Update: 2020-06-23 10:22 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రైతుబంధుపై నిబంధనలు విధించడం మంచిపద్ధతి కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. మంగళవారం సీఎం కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ రాశారు. ధాన్యం సేకరణలో 5 నుంచి 10కిలోల తరుగు తీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకాలకు క్వింటాలుకు రూ.2,500 మద్ధతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండ్ల తోటల రైతులకు కూడా ప్రోత్సహకాలు ఇవ్వాలని లేఖలో కోరారు.

Tags:    

Similar News