పీసీసీ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం : శ్రీధర్ బాబు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పీసీసీ చీఫ్ ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీనియర్లకు ఇవ్వాలా? కొత్త వాళ్లకు ఇవ్వాలా? హైకమాండ్ తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే 160 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపించినప్పటికీ… ఎటూ తేల్చలేక అధిష్టానం పీసీసీ చీఫ్ ఎంపికను జాప్యం చేస్తోంది. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ఎవరికిచ్చినా అందరం కలిసి […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పీసీసీ చీఫ్ ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీనియర్లకు ఇవ్వాలా? కొత్త వాళ్లకు ఇవ్వాలా? హైకమాండ్ తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే 160 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపించినప్పటికీ… ఎటూ తేల్చలేక అధిష్టానం పీసీసీ చీఫ్ ఎంపికను జాప్యం చేస్తోంది. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ఎవరికిచ్చినా అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. బీజేపీ-టీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని తెలిపారు.