‘గాంధీ’పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణ
దిశ, సంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణ చేశారు. కరోనా రోగి చనిపోతే ప్యాకింగ్ చేయడానికి గాంధీ ఆసుపత్రి సిబ్బంది రూ.30 వేలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఎలాగూ నాణ్యమైన వైద్యం అందించకపోవడంతో పేదలు బతికే అవకాశం లేదన్నారు. కనీసం మృతదేహాన్ని కూడా ప్రభుత్వం ప్యాక్ చేసి ఇవ్వదా అని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులు కోలుకుంటుంటే, గాంధీలో చేరిన వారిలో సగం మంది చనిపోతున్నారని, దీనిపై దృష్టి పెట్టాలని మంత్రి ఈటలను […]
దిశ, సంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణ చేశారు. కరోనా రోగి చనిపోతే ప్యాకింగ్ చేయడానికి గాంధీ ఆసుపత్రి సిబ్బంది రూ.30 వేలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఎలాగూ నాణ్యమైన వైద్యం అందించకపోవడంతో పేదలు బతికే అవకాశం లేదన్నారు. కనీసం మృతదేహాన్ని కూడా ప్రభుత్వం ప్యాక్ చేసి ఇవ్వదా అని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులు కోలుకుంటుంటే, గాంధీలో చేరిన వారిలో సగం మంది చనిపోతున్నారని, దీనిపై దృష్టి పెట్టాలని మంత్రి ఈటలను కోరారు. సచివాలయం నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్ బిజీగా ఉంటే.. సీఎస్‌కు ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.