హుజురాబాద్ వేదికగా.. వామపక్షాలకు ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్..?
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ఉప ఎన్నికలపై కాంగ్రెస్‌పార్టీ కొత్త ప్లాన్ వేసింది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మినహా.. అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేద్దామంటూ కొత్త ప్రతిపాదనను ముందుంచాయి. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందని, అన్ని విపక్షాలు కలిసి వస్తే మంచిదనే అభిప్రాయాన్ని నేతల ముందుంచారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ను దెబ్బ కొట్టడమే కదా..! అఖిలపక్ష నేతల ముందున్న టార్గెట్ కేసీఆర్‌ను దెబ్బ […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ఉప ఎన్నికలపై కాంగ్రెస్‌పార్టీ కొత్త ప్లాన్ వేసింది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మినహా.. అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేద్దామంటూ కొత్త ప్రతిపాదనను ముందుంచాయి. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందని, అన్ని విపక్షాలు కలిసి వస్తే మంచిదనే అభిప్రాయాన్ని నేతల ముందుంచారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు.
కేసీఆర్‌ను దెబ్బ కొట్టడమే కదా..!
అఖిలపక్ష నేతల ముందున్న టార్గెట్ కేసీఆర్‌ను దెబ్బ కొట్టడమేనని ఇటీవల అఖిలపక్ష వర్గాలన్నీ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీకి రాష్ట్రంలో చేయందిస్తున్నారు. ఇటీవల జరిగిన భారత్‌బంద్‌లో అంతా కలిసి పాల్గొన్నారు. అయితే కేంద్రస్థాయిని వదిలేస్తే.. రాష్ట్రంలో మాత్రం అందరికీ ఏకైక టార్గెట్కేసీఆర్ మాత్రమేనని తేటతెల్లమైంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ రథసారధి ప్రొఫెసర్ కోదండరాంతో పాటు సీపీఐ, సీపీఎంతో సహా పలు పార్టీలన్నీ కేసీఆర్‌ను గద్దె దించాలనే లక్ష్యమంటూ అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ఎవరికి వారుగా ఉంటే సీఎంను దెబ్బ కొట్టడం సాధ్యం కాదని, అందుకే కలిసికట్టుగా ఉందామంటూ రేవంత్ ఆధ్వర్యంలో తీర్మానం కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇటీవల అఖిలపక్షాల వ్యవహారం చూస్తే మాత్రం అది నిజమేననిపిస్తోంది.
టీడీపీ వద్దు..
ఇక అఖిలపక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీని దూరం పెట్టారు. ప్రధాన నేతలంతా టీడీపీ వద్దంటూ చెప్పడంతో.. ఆ పార్టీని ఆహ్వానించడం లేదు. టీడీపీలో ఉన్న కీలక నేతలు మొత్తం రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్కండువా కప్పుకున్నారు. ఇంకా మిగిలిన వారిలో కొద్దిమంది ఇప్పటికీ రేవంత్‌తో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో మాత్రం టీడీపీ వద్దనే అభిప్రాయం స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతోనే ఎక్కువ నష్టం జరిగిందంటూ, ఇప్పుడు అలాంటి పరిస్థితి రిపీట్కావద్దంటూ టీడీపీని పక్కన పెట్టారు.
మీరా.. మేమా..?
మరోవైపు కాంగ్రెస్‌పార్టీ హుజురాబాద్ఎన్నికల్లో పోటీపై టీజేఎస్, వామపక్షాలకు కూడా ఆఫర్ఇస్తున్నట్లు సమాచారం. కానీ వామపక్షాలు మాత్రం కొంత వెనకడుగు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. దీనిలో భాగంగా మాణిక్కం ఠాగూర్ మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేయనున్నారు. ఏఐసీసీ ఆదేశాలతో హుటాహుటినా ఠాగూర్ ఇవ్వాళ రాష్ట్రానికి వస్తున్నారు.
గాంధీభవన్‌లో భేటీ..
గాంధీ భవన్‌లో ఇవ్వాల ఉదయం 11 గంటల నుంచి అఖిలపక్షం నేతలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీటింగ్నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి టీజేఎస్, వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు హాజరయ్యాయి. పది రోజుల వ్యవధిలో అఖిలపక్షం నేతలు రెండో సారి కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్‌కు వచ్చారు. అయితే బహిరంగంగా మాత్రం నిరసనలకు మద్దతు కోసం అంటూ చెప్పుతున్నారు. అక్టోబర్ 2 నుంచి కాంగ్రెస్ చేపట్టనున్న విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ పోరుకు మద్దతు కూడగట్టుతున్నామని, అక్టోబర్ 5 నుంచి తలపెట్టిన పోడు భూముల పోరుపై నేతలతో చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి. కానీ హుజురాబాద్ బై ఎలక్షన్స్‌లో కలిసి పోటీచేసే అంశంపైనే చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.