మోడీ జీ.. నేను చెప్పిందే జరిగింది కదా.. ఇప్పుడేమంటారు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కట్టడి కోసం విదేశీ వ్యాక్సిన్లకు అనుమతినిచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కేంద్రానికి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘మొదలు వాళ్లు నిన్ను విస్మరిస్తారు. తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆపై నీతో పోరాడతారు. చివరికి నువ్వే గెలుస్తావు..’ అంటూ ట్వీట్ చేశారు. విదేశీ వ్యాక్సిన్లను అనుమతించాలని గతంలో ఆయన సూచించినా కేంద్రం మాత్రం రాహుల్‌పై విమర్శల […]
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కట్టడి కోసం విదేశీ వ్యాక్సిన్లకు అనుమతినిచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కేంద్రానికి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘మొదలు వాళ్లు నిన్ను విస్మరిస్తారు. తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆపై నీతో పోరాడతారు. చివరికి నువ్వే గెలుస్తావు..’ అంటూ ట్వీట్ చేశారు. విదేశీ వ్యాక్సిన్లను అనుమతించాలని గతంలో ఆయన సూచించినా కేంద్రం మాత్రం రాహుల్‌పై విమర్శల దాడి చేసింది. కానీ ఇప్పుడు విదేశీ వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం స్పుత్నిక్-వి కి డీసీజీఐ అనుమతులివ్వగా.. మరో ఐదు విదేశీ వ్యాక్సిన్ల క్లినికల్ టెస్టులకు కూడా ఓకే తెలిపింది.