‘అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు’
దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్ పరిధిలో గల 8, 10వ వార్డుల్లో రహదారులు చిన్నపాటి వర్షానికే రోడ్డు గుంతలుగా మారి, బుదరమయంగా తయారవుతోందని స్థానిక కాంగ్రెస్ నాయకులు దర్పల్లి శ్రీను అన్నారు. చిన్నపిల్లలు, వృద్దులు ఈ రోడ్లపై నడవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి చేతులు దులుపుకుంటున్నారు అని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం […]
దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్ పరిధిలో గల 8, 10వ వార్డుల్లో రహదారులు చిన్నపాటి వర్షానికే రోడ్డు గుంతలుగా మారి, బుదరమయంగా తయారవుతోందని స్థానిక కాంగ్రెస్ నాయకులు దర్పల్లి శ్రీను అన్నారు. చిన్నపిల్లలు, వృద్దులు ఈ రోడ్లపై నడవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి చేతులు దులుపుకుంటున్నారు అని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆదివారం స్థానిక కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై బురదలో వరి నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, మంత్రి హరీష్ రావు స్పందించి, సీసీ రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు.