గ్రేటర్‌లో బోగస్‌ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం బోగస్ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి సూచనలు, సలహాలు చేశారు. ఓట్లను చేర్పించడంలో కాంగ్రెస్ సరైన దిశగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అంటే మొత్తం జనాభా డివైడెడ్ బై సీట్లు ఉండాలి కానీ… ఇక్కడ అడ్డగోలుగా డివిజన్లను విభజించారన్నారు. పాతబస్తీ డివిజన్లలో 15 నుంచి 30వేల […]

Update: 2020-09-08 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం బోగస్ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి సూచనలు, సలహాలు చేశారు. ఓట్లను చేర్పించడంలో కాంగ్రెస్ సరైన దిశగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అంటే మొత్తం జనాభా డివైడెడ్ బై సీట్లు ఉండాలి కానీ… ఇక్కడ అడ్డగోలుగా డివిజన్లను విభజించారన్నారు. పాతబస్తీ డివిజన్లలో 15 నుంచి 30వేల ఓటర్లు ఉంటే ఇంకో దగ్గర 80వేల ఓటర్లున్నరన్నారు.

డీలిమిటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మేయర్‌ పదవి సైతం బీసీ ఉమెన్ రిజర్వ్ చేశారని పేర్కొన్నారు. 150డివిజన్లలో ముఖ్య నేతలను గుర్తించి గడప గడపకు పాదయాత్ర చేసి వాళ్లనే నామినేట్ చేస్తే బాగుంటుందన్నారు. బూత్ స్థాయిలో పకడ్బందీగా ఓట్లను పొందే విధంగా పనిచేయాలన్నారు. నా పార్లమెంట్ పరిధిలో ఏ నియమాకాలు జరిగినా డీసీసీ, ఇంచార్జి ప్రధాన కార్యదర్శి అప్రోవల్ ద్వారా చేయాలని మనవి చేస్తున్నానని, అన్ని డివిజన్లలో మేనిఫెస్టో ఏర్పాటు చేయాలని కోరారు.

Tags:    

Similar News