కాంగ్రెస్ నాయకులు హౌస్ అరెస్ట్
దిశ, మహబూబ్ నగర్: కృష్ణా జలాల పరిరక్షణలో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులను ఎక్కడికక్కడా గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీ కృష్ణ, నాగం జనార్దన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, ఇతర కీలక […]
దిశ, మహబూబ్ నగర్: కృష్ణా జలాల పరిరక్షణలో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులను ఎక్కడికక్కడా గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీ కృష్ణ, నాగం జనార్దన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, ఇతర కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు. అదే విధంగా పలువురు కీలక నేతలను కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పొలీస్ స్టేషన్లకు తరలించారు. కర్వేన వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాలో నిర్మాణంలో ఉన్న అని ప్రాజెక్టుల వద్ద పోలీసులు పహారాను ఏర్పాటు చేశారు.