కేసీఆర్ అందుకే ఇలా చేస్తున్నారా..? కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ నేత ఏమన్నారంటే..!
దిశ, కమలాపూర్: హుజరాబాద్ లో జరగబోయే ఉప ఎన్నిక అతి ఖరీదైన ఎన్నిక గా ప్రజలు చర్చించుకుంటున్నారని, ఇంత డబ్బు నాయకులకు ఎక్కడిదని? ఇది ప్రజాస్వామ్యమా లేక వ్యాపారమా? అని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బాలసాని రమేష్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఒక కళ అని, ప్రత్యేక రాష్ట్రం […]
దిశ, కమలాపూర్: హుజరాబాద్ లో జరగబోయే ఉప ఎన్నిక అతి ఖరీదైన ఎన్నిక గా ప్రజలు చర్చించుకుంటున్నారని, ఇంత డబ్బు నాయకులకు ఎక్కడిదని? ఇది ప్రజాస్వామ్యమా లేక వ్యాపారమా? అని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బాలసాని రమేష్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఒక కళ అని, ప్రత్యేక రాష్ట్రం సాధించడం ఆషామాషీ కాదని, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తెలిసి కూడా 2009లో కరీంనగర్ సభలో సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని తెలిపారు.
కలిసికట్టుగా, పార్టీలకతీతంగా తెలంగాణ జెండాకు ఓనర్లమని రాష్ట్రం మనదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని కోవర్ట్ సిద్ధాంతం ఇక్కడ ఉందని, రాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రకృతి వనం, వైకుంఠధామం పేరుతో పేదల భూములను గుంజుకుంటున్నారని, ప్రభుత్వం పేదలకు ఇస్తానన్న భూముల కోసం భూ సేకరణ చేపట్టడం లేదు కానీ, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని భూములన్నీ అమ్ముతున్నారని దీనికోసమే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేశారని, దళిత బంధు ఎన్నికల కోసమే తెచ్చాడని రాష్ట్రం ఎటుపోతుందో ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు . కెసీఆర్ అహంతో, అహంకారంతో కుటుంబ పాలన చేస్తే, ఊరుకోవడానికి తన అబ్బ జాగీరు కాదని, తెలంగాణ ప్రజల ఓపిక నశిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి ఈటల ప్రజా సమస్యల కోసం పోరాడి కెసీఆర్ తో విభేదించి రాజీనామా చేశాడా? ఎందుకోసం చేశాడో, ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లు అడగాలన్నారు. ఈటల తన రక్షణ కోసమే బీజేపీ పార్టీలో చేరారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ ఒకటేనని దీనికి నిదర్శనం పెరిగిన పెట్రోల్ ధరలు అని అన్నారు.
త్వరలోనే హుజురాబాద్ లో జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని, జరగబోయే ఖరీదైన ఉప ఎన్నికకు చరమగీతం పాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయిని రాజేందర్రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, దొమ్మాటి సాంబయ్య, బంక సరళ సంపత్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, రామకృష్ణ, పత్తి కృష్ణారెడ్డి, రవీందర్ ,దేశిని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.