‘గువ్వల బాలరాజు గుప్తనిధుల వేటగాడు.. రేవంత్‌ను అనే సీన్ లేదు’
దిశ, కల్వకుర్తి: రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు లేదని నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. కల్వకుర్తిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గువ్వల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. రేవంత్ రెడ్డి జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో వలస బిడ్డను అని చెప్పుకునే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందని చిక్కుడు వంశీకృష్ణ ప్రశ్నించారు. […]
దిశ, కల్వకుర్తి: రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు లేదని నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. కల్వకుర్తిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గువ్వల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. రేవంత్ రెడ్డి జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో వలస బిడ్డను అని చెప్పుకునే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందని చిక్కుడు వంశీకృష్ణ ప్రశ్నించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చారిత్రాత్మక ఆలయాలను కూల్చుతూ.. గుప్త నిధుల వేట కొనసాగించే వ్యక్తి గువ్వల బాలరాజు అంటూ ఆరోపించారు. అటువంటి వ్యక్తి టీపీసీసీ రేవంత్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. నల్లమలలో గిరిజనులు, చెంచుల పోడు భూములు సాగు చేసుకుంటూ తరతరాలుగా జీవనం సాగిస్తుంటే.., కొందరు అధికారులు సాయంతో ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేందుకు బాలరాజు కుట్ర చేస్తున్నారని వంశీకృష్ణ చెప్పుకొచ్చారు.
ప్రజలు, అధికారులనే తేడా లేకుండా ఎంతోమందిపై చేయి చేసుకోవడం జరిగిందని.. గువ్వలపై రౌడీ షీట్ నమోదు చేయాలని ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. పదవుల కోసం సీఎం కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు.. అవసరమైతే ఆయన కాళ్లు పట్టుకోవాలి తప్పా… రేవంత్ రెడ్డిని విమర్శిస్తేనే పదవులు వస్తాయని పనిగా పెట్టుకుంటే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చిక్కుడు వంశీకృష్ణ హెచ్చరించారు.