అంబులెన్సులను అడ్డుకోవడం సరికాదు : వీహెచ్

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ బోర్డర్ వద్ద ప్రవేశించకుండా అడ్డుకోవడం సరికాదని మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక పక్క తెలంగాణ హైకోర్టు అంబులెన్సులను అడ్డుకోవద్దని తేల్చిచెప్పినా పోలీసులు ఆసుపత్రి నుంచి అనుమతి పత్రం అందిస్తేనే తెలంగాణలో ప్రవేశానికి అనుమతిస్తాననడంపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌పై ఇంకా మూడేళ్ల పాటు హక్కున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర […]

Update: 2021-05-14 10:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ బోర్డర్ వద్ద ప్రవేశించకుండా అడ్డుకోవడం సరికాదని మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక పక్క తెలంగాణ హైకోర్టు అంబులెన్సులను అడ్డుకోవద్దని తేల్చిచెప్పినా పోలీసులు ఆసుపత్రి నుంచి అనుమతి పత్రం అందిస్తేనే తెలంగాణలో ప్రవేశానికి అనుమతిస్తాననడంపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌పై ఇంకా మూడేళ్ల పాటు హక్కున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర చికిత్స కోసం వస్తున్న వారిని వెంటనే అనుమతించాలని లేదంటే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా డీజీపీ వహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News