‘దౌర్భాగ్యమే ఇది.. మెడిసిన్ మీద జీఎస్టీ ఏంటి’

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను అడ్డుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రాధాన్యతను గుర్తించలేని దౌర్భాగ్యపు సీఎం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ ఏడేళ్ల తర్వాత గాంధీకి వెళ్లిన ముఖ్యమంత్రి.. జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు కెన్యా […]

Update: 2021-05-31 04:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను అడ్డుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రాధాన్యతను గుర్తించలేని దౌర్భాగ్యపు సీఎం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ ఏడేళ్ల తర్వాత గాంధీకి వెళ్లిన ముఖ్యమంత్రి.. జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు కెన్యా దేశం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి రావడం తలదించుకునే విషయమన్నారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు పూర్తిగా పడిపోయిందని, మోదీ పాలనలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసకబారిందన్నారు. ప్రాణాలు కాపాడే మందుల మీద కూడా జీఎస్టీ వేయడం దౌర్భాగ్యమని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

Tags:    

Similar News