‘రాబోయే ఎన్నికల్లో యువతకు పెద్దపీట’
దిశ, సిద్దిపేట: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా నియామకం అయిన మణికం ఠాగూర్ మొట్టమొదటి సారి తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మణికం ఠాగూర్ మాట్లాడుతూ… పార్టీలో పనిచేసే నాయకులు విభేదాలు లేకుండా కలిసి మెలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఉంటుందని, కింది స్థాయిలో పనిచేస్తున్న […]
దిశ, సిద్దిపేట: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా నియామకం అయిన మణికం ఠాగూర్ మొట్టమొదటి సారి తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మణికం ఠాగూర్ మాట్లాడుతూ… పార్టీలో పనిచేసే నాయకులు విభేదాలు లేకుండా కలిసి మెలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఉంటుందని, కింది స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.