ఇంత ఖరీదైన ఎన్నిక ఎప్పుడూ చూడలేదు : కాంగ్రెస్ నేత మహేష్ కుమార్
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కమార్ గౌడ్ ఆరోపించారు. దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడబోమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిన ఈటల, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడని విమర్శించారు. ఈటల అవినీతిలో టీఆర్‌ఎస్‌కు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. టీఆర్‌ఎస్, బీజేపీలకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలు […]
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కమార్ గౌడ్ ఆరోపించారు. దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడబోమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిన ఈటల, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడని విమర్శించారు. ఈటల అవినీతిలో టీఆర్‌ఎస్‌కు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. టీఆర్‌ఎస్, బీజేపీలకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలు ప్రశ్నించాలని మహేష్ సూచించారు. టీఆర్ఎస్ ప్రజలకిచ్చిన హామీలు గాలికొదిలేసిందని ఎద్దేవా చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలను రోజురోజుకూ పెంచుతూ.. పేదల నడ్డీ విరుస్తోన్న బీజేపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను అమలు చేస్తున్నాయని అన్నారు. మోడీ దేశాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు అన్నింటినీ అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విద్యార్థి, నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ అని, వారి తరపున పోరాటం చేస్తోన్న వ్యక్తి అని అన్నారు. అవినీతి పరులకు కాకుండా, ప్రజల పక్షాన పోరాడే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని హుజురాబాద్ ప్రజలను కోరారు. రేపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, ఇప్పటికే తమ పార్టీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ అందరూ ప్రచారంలో నిమగ్నమయ్యారని అన్నారు.