టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి భద్రత లేదు- కాంగ్రెస్ నేత గండ్ర
దిశ, భూపాలపల్లి: రేగొండ పోడు భూములు ఉన్న రైతులకు పూర్తి హక్కులు కల్పించి, వాటిపై అటవీ అధికారులు ఎలాంటి దాడులు చేయకుండా చూడాలని కాంగ్రెస్ నాయకులు గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. మంగళవారం రోజు ఆయన ఘన్‌పూర్ మండలంలోని గాంధీ నగర్ వద్ద సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రేగొండ మండలంలో జరిగిన సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆదివాసీలు, గిరిజనులు, హరిజనులకు భద్రత లేకుండా […]
దిశ, భూపాలపల్లి: రేగొండ పోడు భూములు ఉన్న రైతులకు పూర్తి హక్కులు కల్పించి, వాటిపై అటవీ అధికారులు ఎలాంటి దాడులు చేయకుండా చూడాలని కాంగ్రెస్ నాయకులు గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. మంగళవారం రోజు ఆయన ఘన్‌పూర్ మండలంలోని గాంధీ నగర్ వద్ద సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రేగొండ మండలంలో జరిగిన సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆదివాసీలు, గిరిజనులు, హరిజనులకు భద్రత లేకుండా పోయిందని, ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతుల భూములను లాక్కోవడానికి అటవీశాఖ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అంతేగాక, భూమిలో పంట వేసిన అనంతరం అటవీశాఖ అధికారులు పంట ధ్వంసం చేసి రైతులపై దాడులు చేస్తూ అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఇలాంటి చర్యలు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.
శాసనసభలో ముఖ్యమంత్రి పోడు భూములకు హక్కు కల్పిస్తామని, దాని కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షం వెళ్తోందని మాయమాటలు చెప్పి రైతులను మోసం చేస్తుందని ఆయన అన్నారు. మంగళవారం రోజు సడక్ బంద్ కార్యక్రమంలో 18 పార్టీల వారు పాల్గొంటున్నారని, ప్రభుత్వానికి ముందు ముందు తమ నిరసన తెలియజేస్తామన్నారు. ఆయనతోపాటు అఖిలపక్ష నాయకులు బండు సాయిలు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.