కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి..

దిశ,వెబ్ డెస్క్:  కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌ పటేల్‌ బుధవారం మృతి చెందారు. కరోనా చికిత్స పొందుతూ గురుగావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఫైసల్‌ పటేల్‌ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆయనకు నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది.  కాగా ఈ రోజు ఉదయం గం. 3.30లకు ఆయన […]

Update: 2020-11-24 20:34 GMT
దిశ,వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌ పటేల్‌ బుధవారం మృతి చెందారు. కరోనా చికిత్స పొందుతూ గురుగావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఫైసల్‌ పటేల్‌ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆయనకు నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది. కాగా ఈ రోజు ఉదయం గం. 3.30లకు ఆయన తుది శ్వాస విడిచారని ఆయన కుమారుడు ట్టిట్టర్‌లో వెల్లడించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన రాజకీయ సలహాదారునిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్‌ విజయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు.

Tags:    

Similar News