లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలి
దిశ, న్యూస్ బ్యూరో: వన్యప్రాణుల చట్టం కింద అరెస్ట్ చేసిన దళితుడ్ని పోలీసులు వేధించి, కొట్టడంతో మరణించాడని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ్మలు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్‌కు విన్నవించారు. ఈ మేరకు గురువారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్యను పోలీసులు గత […]
దిశ, న్యూస్ బ్యూరో: వన్యప్రాణుల చట్టం కింద అరెస్ట్ చేసిన దళితుడ్ని పోలీసులు వేధించి, కొట్టడంతో మరణించాడని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ్మలు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్‌కు విన్నవించారు. ఈ మేరకు గురువారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్యను పోలీసులు గత నెల 26న హత్య చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. రంగయ్యను హత్య చేసిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి హడావుడిగా పూడ్చి పెట్టారని వివరించారు. పోలీసులు రంగయ్య కుటుంబాన్ని తీవ్రంగా బెదిరిస్తున్నారని, పోలీసులు తీరు భయంకరంగా ఉందని, గతంలో మంథనిలో మధుకర్ అనే దళితుడు అనుమానస్పదంగా మృతి చెందాడని వివరించారు. రంగయ్య లాకప్ డెత్ విషయంలో పోలీసులపై సీబీఐ విచారణ జరిపించాలని వినతిపత్రంలో కోరారు.