రేవంత్ ఇంటిపై దాడి.. నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జుబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర టీఆర్​ఎస్​ నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. అనుకోకుండా ఒక్కసారిగా టీఆర్​ఎస్​ కార్యకర్తలు రేవంత్​ ఇంటిని ముట్టడించి నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గోడవ మరింత పెరగడంతో పోలీసులు రెండు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని చక్కదిద్దారు. […]

Update: 2021-09-21 05:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జుబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర టీఆర్​ఎస్​ నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. అనుకోకుండా ఒక్కసారిగా టీఆర్​ఎస్​ కార్యకర్తలు రేవంత్​ ఇంటిని ముట్టడించి నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గోడవ మరింత పెరగడంతో పోలీసులు రెండు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య జరుగుతున్న డ్రగ్స్ వార్‌కు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

దీనిపై కేటీఆర్, రేవంత్‌పై పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సోషల్​ మీడియా వేదికగా ఇద్దరూ ఆరోపణలకు దిగారు. ఈ నేపథ్యంలో కేటీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రేవంత్ ఇంటి వద్ద ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. రేవంత్​ ఇంటి దగ్గరకు రాకుండా టీఆర్​ఎస్​ కార్యకర్తలను పెద్దమ్మ గుడి వరకు ఉరికించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో స్వల్ప లాఠీ చార్జ్ చేసి.. ఇరు వర్గాలను చెల్లా చెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

కేసీఆర్​ దిష్టిబొమ్మలు తగులబెట్టండి

రేవంత్​రెడ్డి ఇంటిపై టీఆర్​ఎస్​ గుండాలు దాడి చేశారంటూ కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. ఈ దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్​ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​, సీనియర్​ ఉపాధ్యక్షుడు మల్లు రవి పిలుపునిచ్చారు. ఈ అప్రజాస్వామిక చర్యలను ఖండించాలని, మండల కేంద్రాల్లో నిరసనలకు దిగాలని కాంగ్రెస్​ అత్యవసరంగా పార్టీ శ్రేణులకు సూచించింది.

రగులుతున్న చిచ్చు

డ్రగ్స్​ విచారణ నేపథ్యంలో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య చిచ్చు రగులుతోంది. రెండు రోజుల నుంచి ఈ వివాదం కొలక్కిరావడం లేదు. దీనిపై పరీక్షలకు సిద్ధమంటూ కేటీఆర్​ చెప్పగా.. రేవంత్​రెడ్డి సవాల్​ చేశారు. వైట్​ ఛాలెంజ్​ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్​లో రాద్ధాంతం చేసుకున్నారు. అయితే ఆ వివాదం సమసిపోతుందని ఇరు పార్టీలు భావించాయి. కానీ టీఆర్​ఎస్​ నేతలు రేవంత్​రెడ్డి ఇంటిని ముట్టడించడంతో కాంగ్రెస్​ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో డ్రగ్స్​ వివాదం నేతల మధ్య రగులుతున్నట్లే మారింది.

Tags:    

Similar News