లక్ష్మణ్‎‌కు అభినందనల వెల్లువ..!

దిశ, ముషీరాబాద్: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్‎‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు అశోక్‎నగర్‎లోని లక్ష్మణ్ నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నగర కార్యదర్శి సలంద్ర శ్రీనివాస్ యాదవ్, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు సురేష్ ముదిరాజ్‎లు లక్ష్మణ్‎‌ను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రమేష్ రామ్, […]

Update: 2020-09-26 09:04 GMT

దిశ, ముషీరాబాద్: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్‎‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు అశోక్‎నగర్‎లోని లక్ష్మణ్ నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నగర కార్యదర్శి సలంద్ర శ్రీనివాస్ యాదవ్, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు సురేష్ ముదిరాజ్‎లు లక్ష్మణ్‎‌ను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రమేష్ రామ్, కో కన్వీనర్ నవీన్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ గౌడ్, తదితర నాయకులు ఉన్నారు.

Tags:    

Similar News