భార్య తరుచు ఆ పని చేస్తోందని విసిగిపోయిన భర్త.. కోపంతో ఏంచేశాడంటే..?

దిశ, వెబ్‌డెస్క్:గత నెల  చెన్నెలోని  ఒక అపార్టుమెంట్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన స్థానికంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. పార్కింగ్ లో ఉన్న వాహనాలు సడెన్ గా మంటలకు ఆహుతయ్యాయి. విద్యుత్ వైర్లు కానీ, అనుమానించదగ్గ ఘటనలేమి జరగకుండా వాహనాలకు మంటలు ఎలా అంటుకున్నాయి అనేది ఎవరికి అంతు చిక్కలేదు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వాహనాలకు ఒక వ్యక్తి కావాలనే […]

Update: 2021-09-30 22:42 GMT

దిశ, వెబ్‌డెస్క్:గత నెల చెన్నెలోని ఒక అపార్టుమెంట్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన స్థానికంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. పార్కింగ్ లో ఉన్న వాహనాలు సడెన్ గా మంటలకు ఆహుతయ్యాయి. విద్యుత్ వైర్లు కానీ, అనుమానించదగ్గ ఘటనలేమి జరగకుండా వాహనాలకు మంటలు ఎలా అంటుకున్నాయి అనేది ఎవరికి అంతు చిక్కలేదు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వాహనాలకు ఒక వ్యక్తి కావాలనే నిప్పుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేసి విచారించగా అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు.

వివరాలలోకి వెళితే.. చెన్నై అంబత్తూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 26 ఏళ్ల సతీష్‌కు, వెండామనితో వివాహం జరిగింది. పెళ్లైనప్పటినుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో 2019 లో వారిద్దరూ విడిపోయి ఒంటరిగా నివసిస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే భార్య తరచూ ఫోన్ చేసి సతీష్ ని విసిగిస్తోంది. దీంతో కోపం వచ్చిన సతీష్ నెర్కుండ్రం షణ్ముఖనగర్ సత్యం వీధిలో నివాసముంటున్న భార్య ఇంటికి వెళ్లి, ఆమె ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు పెద్దగా వ్యాపించి పక్కనే ఉన్న వాహనాలకు అంటుకున్నాయి. దీంతో నాలుగు బైకులు, ఒక కారు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి దీని వెనుక సతీష్ ప్రమేయం ఉందని గుర్తించారు. అతడిని పట్టుకొని విచారించగా.. ”ఎన్నిసార్లు చెప్పినా నా భార్య మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుండంతో విరక్తి చెందాను. అందుకే ఓ రోజు రాత్రి ఆమె ఉంటున్నఇంటికి వెళ్లి, కోపంతో ఆమె ద్విచక్ర వాహనానికి నిప్పంటించాను” అని నేరం అంగీకరించాడు. భార్యపై కోపంతో సతీష్ చేసిన నిర్వాకం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Tags:    

Similar News