నడిరోడ్డుపై కుప్పలుతెప్పలుగా కండోమ్స్.. వాహనదారులు ఏంచేశారంటే..?
దిశ, వెబ్‌డెస్క్: అది కర్ణాటక తుముకూర్ శివారులోని జాతీయ రహదారి.. వచ్చిపోయే వాహనదారులు ఒక ప్రదేశంలో ఆగి విచిత్రంగా చూసి వెళ్లిపోతున్నారు. ఇంకొంతమంది వాహనాలలోనుంచే చూసుకుంటూ మొహం తిప్పుకొని వెళ్లిపోతున్నారు. ఇంకొంతమంది ఛీఛీ ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాలో అంటూ నెత్తి కొట్టుకొంటూ పక్కకు తప్పుకున్నారు. అసలు అక్కడ అంతలా ఏం జరిగింది. ప్రమాదం ఏమైనా జరిగిందా..? రక్తపు మడుగులో ఎవరైనా ఉన్నారా..? అంటే లేదు.. అక్కడ కుప్పలుతెప్పలుగా కండోమ్స్ పడివున్నాయి. నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు […]
దిశ, వెబ్‌డెస్క్: అది కర్ణాటక తుముకూర్ శివారులోని జాతీయ రహదారి.. వచ్చిపోయే వాహనదారులు ఒక ప్రదేశంలో ఆగి విచిత్రంగా చూసి వెళ్లిపోతున్నారు. ఇంకొంతమంది వాహనాలలోనుంచే చూసుకుంటూ మొహం తిప్పుకొని వెళ్లిపోతున్నారు. ఇంకొంతమంది ఛీఛీ ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాలో అంటూ నెత్తి కొట్టుకొంటూ పక్కకు తప్పుకున్నారు. అసలు అక్కడ అంతలా ఏం జరిగింది. ప్రమాదం ఏమైనా జరిగిందా..? రక్తపు మడుగులో ఎవరైనా ఉన్నారా..? అంటే లేదు.. అక్కడ కుప్పలుతెప్పలుగా కండోమ్స్ పడివున్నాయి. నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్ లు కనిపించడం కలకలం రేపింది. దీంతో రహదారిపై వచ్చిపోయేవారితో సహా వాహనాలలో వెళ్లేవారు కూడా ఆగి మరి చూసి వెళ్లడం గమనార్హం.
కర్ణాటక తుముకూర్ శివారులోని శ్రీరాజ్ థియేటర్ కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లై ఓవర్ పై కండోమ్ లు కుప్పలుగా కనిపించాయి. అయితే వీటిని ఎవరైనా కావాలని పడేశారా..? లేక ఏదైనా వాహనంలో తరలిస్తుంటే పడిపోయాయా..? అనేది తెలియదు. అయితే ఇందులో కొన్ని వినియోగించిన కండోమ్ లు ఉండగా.. మరికొన్ని ప్యాకెట్లలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడిరోడ్డుపై అలా కుప్పలుతెప్పలుగా కండోమ్స్ పడిఉంటే అధికారులు ఏమి చేస్తున్నారు..? రోడ్డును శుభ్రం చేయించకుండా ఇంతవరకు ఏం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇకపోతే ఈ విషయమై అధికారులు స్పందించకపోవడం విశేషం.
ఇవి కూడా చదవండి:
మహిళలకు తీపి కబురు.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
మిషన్ భగీరథ పైపుల్లో 'సాల్మొనెల్లా టైఫి' బ్యాక్టీరియా.. ఆందోళనలో వైద్యులు