‘సాగు చట్టాలు రద్దయ్యేదాకా ఢిల్లీని వీడేది లేదు’
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు తమ తదుపరి కార్యాచరణ ప్రకటించారు. రైతు చట్టాలు రద్దయ్యేదాకా ఢిల్లీని వీడేది లేదన్న రైతులు.. మే నెలలో చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు 40 రైతుల సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ర్యాలీ నిర్వహించే తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. దానిని త్వరలోనే వెల్లడిస్తామని కిసాన్ మోర్చా ప్రతినిధులు తెలిపారు. ర్యాలీలో పెద్ద […]
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు తమ తదుపరి కార్యాచరణ ప్రకటించారు. రైతు చట్టాలు రద్దయ్యేదాకా ఢిల్లీని వీడేది లేదన్న రైతులు.. మే నెలలో చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు 40 రైతుల సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ర్యాలీ నిర్వహించే తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. దానిని త్వరలోనే వెల్లడిస్తామని కిసాన్ మోర్చా ప్రతినిధులు తెలిపారు. ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని రైతు సంఘాల నేతలు కోరారు. ఈ ర్యాలీలో పాల్గొనేవారికి అన్ని రకాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్లమెంటు ర్యాలీ కంటే ముందే.. ఏప్రిల్ 10న కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు.