ఎంపీపీ పాలనకు రెండేళ్లు పూర్తి.. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన సామినేని

దిశ, పాలేరు: ముదిగొండ మండల ప్రజా పరిషత్ పాలనకు శుక్రవారంతో రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ముదిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బి శ్రీనివాసరావు అధ్యక్షతన ఎంపీటీసీలు, ఎంపీపీ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్వామినేని హరిప్రసాద్ మాట్లాడుతూ పాలన విజయవంతానికి సహకరించిన ఎంపీటీసీలకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మరో మూడేళ్ల పాటు ఇలాగే ముందుకు సాగాలని ఆయన కోరారు. రెండేళ్లలో కరోనా ప్రభావం వల్ల […]

Update: 2021-08-06 06:10 GMT

దిశ, పాలేరు: ముదిగొండ మండల ప్రజా పరిషత్ పాలనకు శుక్రవారంతో రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ముదిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బి శ్రీనివాసరావు అధ్యక్షతన ఎంపీటీసీలు, ఎంపీపీ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్వామినేని హరిప్రసాద్ మాట్లాడుతూ పాలన విజయవంతానికి సహకరించిన ఎంపీటీసీలకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మరో మూడేళ్ల పాటు ఇలాగే ముందుకు సాగాలని ఆయన కోరారు. రెండేళ్లలో కరోనా ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగినా, దానిని అధిగమించేందుకు గౌరవ ఎంపీటీసీలు సహకరించాలని పాలనను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. అనంతరం ఎంపీపీ కేక్ కట్ చేసిన ఎంపీటీసీలు, అధికారులకు స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.

జయశంకర్ సార్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి..

తెలంగాణ స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ముదిగొండ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సామినేని హరిప్రసాద్ కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బి శ్రీనివాసరావు అధ్యక్షతన జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎం దామోదర్, డిప్యూటీ తహసీల్దార్ టీ కరుణాకర్ రెడ్డి, ఈఓ పీఆర్‌డీపీ సూర్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ శ్రీ బంక మల్లయ్య, ఎంపీటీసీలు కోయ రమేష్, ఆదినారాయణ రెడ్డి పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

కూలీలతో కలిసి నాటు వేసిన కోదాడ ఎంపీపీ

Tags:    

Similar News