అలర్ట్.. మే 8 నుంచి 16 వరకు లాక్‌డౌన్

తిరువనంతపురం : కేరళలో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతున్న తరుణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మే 8 ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే లాక్‌డౌన్ ఈనెల 16 వరకు కొనసాగనుంది. దేశవ్యాప్త పూర్తిస్థాయిలో కఠిన లాక్‌డౌన్ విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నా.. కేంద్రం దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. లాక్‌డౌన్ ఆఖరి అవకాశంగా ఉండాలని, దానిని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తున్నట్టు […]

Update: 2021-05-06 00:42 GMT

తిరువనంతపురం : కేరళలో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతున్న తరుణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మే 8 ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే లాక్‌డౌన్ ఈనెల 16 వరకు కొనసాగనుంది. దేశవ్యాప్త పూర్తిస్థాయిలో కఠిన లాక్‌డౌన్ విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నా.. కేంద్రం దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. లాక్‌డౌన్ ఆఖరి అవకాశంగా ఉండాలని, దానిని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఒడిషా వంటి రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే. బుధవారం కేరళలో 41,953 కేసులు నమోదుకాగా 58 మంది మరణించారు.

Tags:    

Similar News