కోదాడలో 31 నుంచి సంపూర్ణ లాక్డౌన్
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జులై 31 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. కరోనాను కట్టడి చేసేందుకే స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జూలై 31 నుండి ఆగస్టు 14 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించనున్నట్లు కమిషన్ పేర్కొన్నారు. మెడికల్ షాపులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు […]
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జులై 31 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. కరోనాను కట్టడి చేసేందుకే స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
జూలై 31 నుండి ఆగస్టు 14 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించనున్నట్లు కమిషన్ పేర్కొన్నారు. మెడికల్ షాపులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా సామాజిక వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని.. పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.