ఆ ఆపిల్ చార్జర్ సరిగా పనిచేస్తలేదట..
వెబ్‌డెస్క్: ఆపిల్ ఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు. చాలా మంది ఈ ఫోన్ కొనడానికి ఇంట్రస్ట్ చూపుతారు. చేతిలో ఆఫోన్ ఉంటే గ్రేట్‌గా ఫీల్ అవుతారు. స్టన్నింగ్ లుక్‌తోపాటు ఇతర స్మార్ట్ఫోన్ల కంటే ఎంతో మెరుగైన పనితీరు కనబరుస్తుంది. సెక్యూర్‌గా ఉండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య ఆపిల్ సంస్థ ఐఫోన్ 12 మోడల్స్ కోసం రిలీజ్ చేసిన మాగ్‌సేఫ్ డ్యుయో వైర్లెస్ చార్జర్ అంత మెరుగైన పనితీరు కనబర్చడం లేదన్న […]
వెబ్‌డెస్క్: ఆపిల్ ఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు. చాలా మంది ఈ ఫోన్ కొనడానికి ఇంట్రస్ట్ చూపుతారు. చేతిలో ఆఫోన్ ఉంటే గ్రేట్‌గా ఫీల్ అవుతారు. స్టన్నింగ్ లుక్‌తోపాటు ఇతర స్మార్ట్ఫోన్ల కంటే ఎంతో మెరుగైన పనితీరు కనబరుస్తుంది. సెక్యూర్‌గా ఉండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
అయితే ఈ మధ్య ఆపిల్ సంస్థ ఐఫోన్ 12 మోడల్స్ కోసం రిలీజ్ చేసిన మాగ్‌సేఫ్ డ్యుయో వైర్లెస్ చార్జర్ అంత మెరుగైన పనితీరు కనబర్చడం లేదన్న కామెంట్స్ వస్తున్నాయి. మాగ్‌సేఫ్ వైర్లెస్ చార్జర్ అంత పర్ఫెక్ట్గా లేదంటున్నారు వినియోగదారులు. ఎందుకంటే ఇది 29w పవర్ అడాప్టర్ అయినప్పటికీ ఫోన్‌తోపాటు యాపిల్ వాచ్ చార్జింగ్‌కి సపోర్ట్ చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఆపిల్ తన సపోర్ట్ డాక్యుమెంట్లో తెలిపినట్టు 29w యుఎస్బీ టైప్ సీ అడాప్టర్ మాగ్‌సేఫ్ డ్యుయోతో కనెక్ట్ కావడం లేదు. ఆ అడాప్టర్‌కు అవసరమైన 5V / 3A లేదా 9V / 1.6A పవర్ రేటింగ్‌కు సపోర్ట్ కాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
మాగ్‌సేఫ్ డ్యూయో 29W అడాప్టర్‌కు కనెక్ట్ అయినప్పుడు ఇది ఒకేసారి ఐ ఫోన్ లేదా ఆపిల్ వాచ్‌లలో ఏదో ఒకదాన్ని మాత్రమే చార్జ్ చేస్తోందంటున్నారు వినియోగదారులు. ఇంతకుముందు ఐ ఫోన్ 12 మినీ పవర్ చార్జింగ్‌లో పీక్ పవర్ డెలివరీలో భాగంగా 12w అడాప్టర్ మాత్రమే పనిచేస్తుందని ఆపిల్ ఇండికేట్ చేసింది. కానీ, లైటినింగ్ ఇయర్‌పాడ్స్ వంటి యాక్ససరీస్ కనెక్ట్‌లో ఉన్నప్పుడు మాగ్‌సేఫ్ చార్జర్ నియంత్రణ ప్రమాణాలకు తగ్గట్టు 7.5w చార్జింగ్కు మాత్రమే పరిమితం అవుతోంది. ఫాస్ట్ చార్జింగ్ కాకపోవడం ఇక్కడ లోపంగా తెలుస్తోంది.