మోహన్ బాబుకు గొల్ల కురుములు షాక్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
దిశ, స్టేషన్ ఘన్ పూర్: గొల్ల కురుమల పట్ల చులకనగా మాట్లాడారంటూ సినీ నటుడు మంచు మోహన్ బాబుపై జనగామ జిల్లా చిల్పూర్ పోలీస్ స్టేషన్‌లో గొర్రెల మేకల పెంపకందార్లు ఫిర్యాదు చేశారు. అనంతరం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ.. సీనియర్ నటుడు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా)కు జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందిన […]
దిశ, స్టేషన్ ఘన్ పూర్: గొల్ల కురుమల పట్ల చులకనగా మాట్లాడారంటూ సినీ నటుడు మంచు మోహన్ బాబుపై జనగామ జిల్లా చిల్పూర్ పోలీస్ స్టేషన్‌లో గొర్రెల మేకల పెంపకందార్లు ఫిర్యాదు చేశారు. అనంతరం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ.. సీనియర్ నటుడు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా)కు జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందిన మరుసటి రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో ఘర్షణ ఏమిటీ? ఏమిటీ గొడవలు? ఏమిటీ బీభత్సం? ఇప్పుడు గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది. అతనూ చూస్తున్నడు ఏం జరుగుతుందని, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి’ అని మాట్లాడారు. దీంతో గొల్ల కురుమలను చులకన చేసి మాట్లాడిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం చిల్పూర్ మండల కమిటీ కార్యదర్శి ఆవుల ప్రభాకర్, మండల కోశాధికారి అపారది రాజు, తదితరులు పాల్గొన్నారు.