అప్రమత్తంగా ఉండండి..

దిశ, సిద్దిపేట: సోమ,మంగళ వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ అన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల సర్పంచ్‌లతో తరచుగా మాట్లాడాలనీ, వరద ఉధృతి ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. ఎవ్వరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దనీ, చేసి విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని సూచించారు. అత్యవసర […]

Update: 2020-10-11 08:58 GMT

దిశ, సిద్దిపేట: సోమ,మంగళ వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ అన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు.

గ్రామాల సర్పంచ్‌లతో తరచుగా మాట్లాడాలనీ, వరద ఉధృతి ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. ఎవ్వరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దనీ, చేసి విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని సూచించారు. అత్యవసర సమయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100, డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8333998699కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన తెలిపారు.

Tags:    

Similar News