Covid: వినూత్నంగా.. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పని చేసే చేతులు!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో ప్రజలంతా భయాందోళనలతో ఇంటికే పరిమితమయ్యారు. కానీ సపాయి కార్మికులు, పోలీసులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది మాత్రం బయటకొచ్చి సేవ చేశారు. అయితే వీరి సేవలకు గుర్తింపుగా కూకట్‌పల్లి మున్సిపల్ అధికారులు ఓ వినూత్న కార్యక్రమం చేశారు. కూకట్‌పల్లి వివేకానంద విగ్రహం వద్ద ఆ సేవకుల శిల్పాలను ఏర్పాటు చేశారు. పోలీసు(స్పందించే హృదయం), డాక్టర్(ప్రేమించే మనసు), శానిటేషన్ సిబ్బంది(పని చేసే చేతులు) విగ్రహాలను నెలకొల్పారు. ఈ విగ్రహాల ఫొటోలను కూకట్‌పల్లి జోనల్ […]

Update: 2021-09-01 08:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో ప్రజలంతా భయాందోళనలతో ఇంటికే పరిమితమయ్యారు. కానీ సపాయి కార్మికులు, పోలీసులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది మాత్రం బయటకొచ్చి సేవ చేశారు. అయితే వీరి సేవలకు గుర్తింపుగా కూకట్‌పల్లి మున్సిపల్ అధికారులు ఓ వినూత్న కార్యక్రమం చేశారు. కూకట్‌పల్లి వివేకానంద విగ్రహం వద్ద ఆ సేవకుల శిల్పాలను ఏర్పాటు చేశారు. పోలీసు(స్పందించే హృదయం), డాక్టర్(ప్రేమించే మనసు), శానిటేషన్ సిబ్బంది(పని చేసే చేతులు) విగ్రహాలను నెలకొల్పారు. ఈ విగ్రహాల ఫొటోలను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ‘‘కరోనా సమయంలో మీరు చేసిన సేవలను ఈ ప్రపంచం ఎప్పుడూ మర్చిపోదు’’ అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News