విజయవాడలో కంట్రోల్ రూం ఏర్పాటు..

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఎడతేరపి లేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ప్రకాశం బ్యారేజికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వలన ఇన్ ఫ్లో గంట గంటకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగర పాలక సంస్థ అప్రమత్తమైంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ప్రనన్న వెంకటేశ్ ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. ఈ […]

Update: 2020-08-16 05:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఎడతేరపి లేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ప్రకాశం బ్యారేజికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వలన ఇన్ ఫ్లో గంట గంటకు పెరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే విజయవాడ నగర పాలక సంస్థ అప్రమత్తమైంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ప్రనన్న వెంకటేశ్ ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సహయం కోసం 0866-2424172, 0866-2422515 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Tags:    

Similar News