మెడిసిన్ విద్యార్థుల్లో నిరాశ.. లక్షలు పోసి చదివినా చివరకు..

మీ అమ్మాయి/అబ్బాయిని డాక్టర్​చేయాలనుకున్న మీ కల సాకారం కావడం లేదా? నీట్​లో సీటు రాలేదని బాధ పడుతున్నారా? మేమున్నాం.. మాయమాటలతో నమ్మించి బురిడీ కొట్టిస్తున్న సంస్థలెన్నో హైదరాబాద్​లో తిష్టవేశాయి. ఏజెంట్లను నియమించుకొని సోషల్​మీడియాతోపాటు హోర్డింగులు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తూ.. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. పొరుగు దేశాలకు తీసుకెళ్లి అక్కడో నాసిరకం కాలేజీలో జాయిన్​చేస్తున్నారు. అక్కడ ఎంబీబీఎస్​ పూర్తి చేసిన వారు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్ఎంజీ పరీక్ష పాస్​కావాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో సగటున […]

Update: 2021-11-24 21:57 GMT

మీ అమ్మాయి/అబ్బాయిని డాక్టర్​చేయాలనుకున్న మీ కల సాకారం కావడం లేదా? నీట్​లో సీటు రాలేదని బాధ పడుతున్నారా? మేమున్నాం.. మాయమాటలతో నమ్మించి బురిడీ కొట్టిస్తున్న సంస్థలెన్నో హైదరాబాద్​లో తిష్టవేశాయి. ఏజెంట్లను నియమించుకొని సోషల్​మీడియాతోపాటు హోర్డింగులు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తూ.. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. పొరుగు దేశాలకు తీసుకెళ్లి అక్కడో నాసిరకం కాలేజీలో జాయిన్​చేస్తున్నారు. అక్కడ ఎంబీబీఎస్​ పూర్తి చేసిన వారు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్ఎంజీ పరీక్ష పాస్​కావాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో సగటున 20% మంది మాత్రమే అర్హత సాధిస్తున్నారు. లక్షలు పోసి చదివించిన మిగతా 80% మంది క్లినికల్​ అసిస్టెంట్లుగానే మిగిలిపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నీట్​లో ర్యాంక్​ తగ్గిందా? పర్వాలేదు మేమున్నాం.. తక్కువ ఫీజుతోనే ఎంబీబీఎస్​సీట్ ఇప్పిస్తాం.’ అంటూ కొన్ని ప్రైవేట్ సంస్థలు మెడిసిన్​చదవాలనుకుంటున్న విద్యార్ధులు, తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. ఏజెంట్లును పెట్టి తతంగం నడుపుతున్నాయి. సోషల్​ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. తక్కువ ఫీజుకే సీట్లు ఇప్పిస్తామని తప్పుదోవ పట్టిస్తున్నాయి. తమ బిడ్డలను ఎట్లైనా మెడిసిన్​చదివించాలన్న ఆసక్తి తల్లిదండ్రులకు ఏజెంట్లు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు కమీషన్ గా తీసుకుంటున్నారు. చివరికి నాణ్యత లేని కాలేజీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. దీంతో తమ పిల్లలకు సరైన విద్య అందడం లేదని, తద్వారా నైపుణ్యతను పరిశీలించే ఎఫ్​ఎంజీ పరీక్షల్లో ఫెయిల్​అవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలా అన్యాయం చేస్తున్న కన్సల్టెన్సీలపై కొందరు పేరంట్స్ ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఏటా 5 వేల మంది

తెలంగాణ నుంచి ఏటా సుమారు నాలుగువేల నుంచి ఐదు వేల మంది విదేశాల్లో ఎంబీబీఎస్​ విద్యను పూర్తి చేస్తున్నారు. వారిలో 20 శాతం మంది మాత్రమే డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. మిగతా వారంతా మన దేశంలో నేషనల్ బోర్డు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామ్‌ పాస్ కాలేకపోతున్నారు . దీంతో నేషనల్​ మెడికల్​ కమిషన్​ రిజిస్ట్రేషన్​ పొందడం సాధ్యం కావడం లేదు. ఇతర దేశాల్లో చదివిన ఎంబీబీఎస్ వృథా అవుతున్నది. చేసేదేమీ లేక తక్కువ జీతానికి క్లినికల్​అసిస్టెంట్లుగా చేరాల్సిన పరిస్థితి నెలకొంది. కెనడా, న్యూజిలాండ్‌, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకు మాత్రం ఎఫ్​ఎంజీ పరీక్ష నుంచి మినహాయింపు ఉన్నది. మిగతా దేశాల్లో ఎక్కడ చదివినా ఎఫ్ఎంజీ పరీక్ష రాయడంతోపాటు.. ఉత్తీర్ణత సాధించాల్సిందే.

2023లో మార్పులు..

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎన్ని సార్లనైనా ఎఫ్​ఎంజీ రాసేందుకు వీలున్నది. 2023 నుంచి నెక్స్ట్‌ స్టెప్ 1, నెక్ట్స్‌ స్టెప్‌ 2 పేరిట రెండు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందని మెడికల్​ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎఫ్‌ఎంజీ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్‌ ను తీసుకురాబోతున్నారు. దీనిని విదేశాల్లో చదివిన వాళ్లతో పాటుగా, మన దేశంలో చదివిన వారూ రాయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఎంబీబీఎస్​ పూర్తయిన తర్వాత రెండేళ్లలో ఈ పరీక్ష పాసైతేనే డాక్టర్​అయ్యే చాన్స్ ఉంటుంది.
ఐదు ఎఫ్‌ఎంజీఈ వివరాలు

సంవత్సరం ఉత్తీర్ణతపొందినవారు(శాతం) ఫెయిల్

జూన్ 2021 4283(24.93) 12,895
డిసెంబర్, 2020 3722(21.34) 13,713
జూన్, 2020 1697(10.95) 13,790
డిసెంబర్, 2019 4242(29.7) 10,025
జూన్, 2019 2767(23.5) 9,006

Tags:    

Similar News