సూర్యాపేటలో 11 హెల్త్ సెంటర్లు ప్రారంభం

దిశ, నల్లగొండ: అత్యవసర సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి క్లస్టర్‌కు ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు సూర్యాపేట పట్టణంలోని శంకర్ విలాస్ సెంటర్‌లో ఎస్పీ ఆర్. భాస్కరన్‌తో కలిసి హెల్త్ సెంటర్లను ఆదివారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర సమయంలో వైద్యం అందించేందుకు జిల్లాలోని 11 క్లస్టర్లలో ఒక సీనియర్ వైద్యాధికారితో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. […]

Update: 2020-04-19 09:14 GMT
  • whatsapp icon

దిశ, నల్లగొండ: అత్యవసర సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి క్లస్టర్‌కు ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు సూర్యాపేట పట్టణంలోని శంకర్ విలాస్ సెంటర్‌లో ఎస్పీ ఆర్. భాస్కరన్‌తో కలిసి హెల్త్ సెంటర్లను ఆదివారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర సమయంలో వైద్యం అందించేందుకు జిల్లాలోని 11 క్లస్టర్లలో ఒక సీనియర్ వైద్యాధికారితో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దగ్గు, జ్వరం, ఇతర రోగాలతో బాధపడే రోగుల కోసం ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేస్తే వైద్య బృందం ఇంటి వద్దకే వచ్చి చికిత్స అందిస్తుందన్నారు. జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో 11 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 11 క్లస్టర్లలో మూడింటిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, అయినా ఆ ప్రాంతాల్లో కూడా 50 వైద్య బృందాలతో సర్వే నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. కంటైన్మెంట్ ఏరియాలో సర్వే నిర్వహిస్తున్న వైద్య బృందాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags;Nalgonda,Suryapet collector,vinay krishna reddy,star,Health centers

Tags:    

Similar News