అభయారణ్యంలో కలెక్టర్ పర్యటన

దిశ, హైదరాబాద్: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో కీసర అభయారణ్యం అటవీ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఎంపీ సంతోష్ కుమార్ హరితహారంలో భాగంగా గతేడాది మాస్ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు చాలా బాగా ఉన్నాయని అన్నారు. వర్షాకాలం వచ్చిన తర్వాత ఖాళీ ఉన్న ప్రతి చోటా మొక్కలు నాటాలని డీఎఫ్‌వోను ఆదేశించారు. ఎకో పార్క్‌ను పరిశీలించిన కలెక్టర్ పార్కులో అన్ని వసతులతో ప్రజల సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్, […]

Update: 2020-04-28 07:45 GMT

దిశ, హైదరాబాద్: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో కీసర అభయారణ్యం అటవీ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఎంపీ సంతోష్ కుమార్ హరితహారంలో భాగంగా గతేడాది మాస్ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు చాలా బాగా ఉన్నాయని అన్నారు. వర్షాకాలం వచ్చిన తర్వాత ఖాళీ ఉన్న ప్రతి చోటా మొక్కలు నాటాలని డీఎఫ్‌వోను ఆదేశించారు.

ఎకో పార్క్‌ను పరిశీలించిన కలెక్టర్ పార్కులో అన్ని వసతులతో ప్రజల సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కీసరలోని చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ తన ఛాంబర్లో కీసర చెరువు సుందరీకరణపై అధికారులతో చర్చించారు. సందర్శనలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, కీసర ఆర్డీవో రవి, డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ నాగరాజు, సర్పంచ్ మాధురి, ఎంపీడీవో శశిరేఖ పాల్గొన్నారు.

Tags: eco park, visit, keesara sanctuary, collector, venkateshwarlu, haritaharam

Tags:    

Similar News