వినూత్నంగా విత్తన గణపతుల పంపిణీ
దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ తరహాలో మిగతా మున్సిపాలిటీలను తీర్చిదిద్దాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో మేడ్చల్ మున్సిపాలిటీ క్లీనెస్ట్ మున్సిపాలిటీగా ఎన్నుకోబడిందని, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీ పరిశుభ్రతతో, అభివృద్ది పనులు చేపట్టి వచ్చే సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్ సాధించాలని ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా మున్సిపల్ కమిషనర్లకు విత్తన గణపతులను అందజేస్తూ.. ఎంపీ […]
దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ తరహాలో మిగతా మున్సిపాలిటీలను తీర్చిదిద్దాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో మేడ్చల్ మున్సిపాలిటీ క్లీనెస్ట్ మున్సిపాలిటీగా ఎన్నుకోబడిందని, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీ పరిశుభ్రతతో, అభివృద్ది పనులు చేపట్టి వచ్చే సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్ సాధించాలని ఆదేశించారు.
వినాయక చవితి సందర్భంగా మున్సిపల్ కమిషనర్లకు విత్తన గణపతులను అందజేస్తూ.. ఎంపీ జె.సంతోష్ కుమార్ హరితహార స్ఫూర్తితో వినూత్నమైన విత్తన గణపతి కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. ప్రజలందరూ విత్తన గణపతులతో పూజలు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, ఆర్డీఓలు మల్లయ్య, రవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే విత్తన గణపతి, మట్టి గణపతులతో పూజలు చేసుకోవాలని కోరారు.