ఫేక్ సందేశాలను నమ్మొద్దు: కలెక్టర్
దిశ, మెదక్: ప్రభుత్వ ఉత్తర్వులు అధికారికంగా వచ్చేవే నమ్మాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ప్రజలను కోరారు. రేపటి నుంచి మద్యం దుకాణాలు తెరుస్తున్నట్లు ఫేక్ ఉత్తర్వుల ప్రచారం జరుగుతుందన్నారు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని, ప్రజలెవరు ఇలాంటి ఫేక్ సందేశాలను నమ్మొద్దని సూచించారు. ఏలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు అయినా మీకు అధికారుల ద్వారా వచ్చినవి మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఉత్తర్వులను సృష్టించిన వారిపై, వీటిని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన వారిపై చట్ట […]
దిశ, మెదక్: ప్రభుత్వ ఉత్తర్వులు అధికారికంగా వచ్చేవే నమ్మాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ప్రజలను కోరారు. రేపటి నుంచి మద్యం దుకాణాలు తెరుస్తున్నట్లు ఫేక్ ఉత్తర్వుల ప్రచారం జరుగుతుందన్నారు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని, ప్రజలెవరు ఇలాంటి ఫేక్ సందేశాలను నమ్మొద్దని సూచించారు. ఏలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు అయినా మీకు అధికారుల ద్వారా వచ్చినవి మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఉత్తర్వులను సృష్టించిన వారిపై, వీటిని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.