ప్రచారం బంద్.. ఎవరైనా అలా చేస్తే రెండేళ్ల జైలు శిక్ష..

దిశ, నల్లగొండ: స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రారంభానికి 72 గంటల ముందు, డిసెంబర్ 7 సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిలిపివేయాలన్నారు. డిసెంబరు 10వ తేదీన పోలింగ్ ముగిసే వరకూ నిశబ్ధ కాలం(సైలెన్స్ పీరియడ్) అని ఆయన తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం.. ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు […]

Update: 2021-12-07 08:36 GMT

దిశ, నల్లగొండ: స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రారంభానికి 72 గంటల ముందు, డిసెంబర్ 7 సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిలిపివేయాలన్నారు. డిసెంబరు 10వ తేదీన పోలింగ్ ముగిసే వరకూ నిశబ్ధ కాలం(సైలెన్స్ పీరియడ్) అని ఆయన తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం.. ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు మీడియా కార్యక్రమాలు నిర్వహించొద్దని సూచించారు.

ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సినిమాటోగ్రాఫీ, టెలివిజన్, ప్రచార సామాగ్రి ప్రజలకు తెలిసేలా ప్రదర్శించొద్దని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News