వలస కూలీలకు మూడ్రోజులపాటు వైద్య పరీక్షలు
దిశ, మహబూబ్ నగర్: రానున్న మూడ్రోజులు జిల్లాలోని వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు, తహీల్దారులు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, ఎస్‌ఐలు, ఎంపీవోలు, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు గ్రామాలకు వైద్య బృందాలను పంపించి వలస కూలీలకు 100 శాతం వైద్య పరీక్షలు చేయాలన్నారు. ఇందుకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి ఒక ఫార్మాట్‌ను రూపొందించి ఆ బృందాలకు అందజేయాలన్నారు. ఈ విషయమై 27న సాయంత్రం […]
దిశ, మహబూబ్ నగర్: రానున్న మూడ్రోజులు జిల్లాలోని వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు, తహీల్దారులు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, ఎస్‌ఐలు, ఎంపీవోలు, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు గ్రామాలకు వైద్య బృందాలను పంపించి వలస కూలీలకు 100 శాతం వైద్య పరీక్షలు చేయాలన్నారు. ఇందుకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి ఒక ఫార్మాట్‌ను రూపొందించి ఆ బృందాలకు అందజేయాలన్నారు. ఈ విషయమై 27న సాయంత్రం 6 గంటలకు నిర్వహించే సమావేశానికి ప్రత్యేక అధికారులు, పీవోలు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Tags: 3 days, migrant labourers, corona tests, collector venkat rao