కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ తనిఖీలు
దిశ, జనగామ : కరోనా వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల మంగళవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జేకేఎస్ ఫెర్టిలైజర్లో పనిచేసిన సిబ్బంది, యాజమాన్యానికి పాజిటివ్ నిర్ధారణ కాగా, కుటుంబ సభ్యులను పరామర్శించి కలెక్టర్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వైద్య సిబ్బందికి పూర్తి సమాచారం అందించాలని సూచించారు. కరోనా సోకిన వారి ఇండ్లలో ఉండే వారు సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. […]
దిశ, జనగామ :
కరోనా వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల మంగళవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జేకేఎస్ ఫెర్టిలైజర్లో పనిచేసిన సిబ్బంది, యాజమాన్యానికి పాజిటివ్ నిర్ధారణ కాగా, కుటుంబ సభ్యులను పరామర్శించి కలెక్టర్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వైద్య సిబ్బందికి పూర్తి సమాచారం అందించాలని సూచించారు. కరోనా సోకిన వారి ఇండ్లలో ఉండే వారు సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొవిడ్-19 సోకిన వ్యక్తులకు నిత్యావసర సరుకులు అందించుటలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా వ్యాపారులు, ప్రజలు సైతం భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి కరోనాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, జనగామ ఆర్డీవో మధుమోహన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.మహేందర్, జనగామ డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ అశోక్, పూర్ణ చందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.